Sneha Choudhary | కోజికోడ్‌కు చెందిన స్నేహ చౌదరి ఐఐఎంలో చదివిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడితే చాలు అనుకోలేదు. తనే ఓ సంస్థను స్థాపించాలని అనుకున్నారు. ఆ వెతుకులాటలో తట్టిన ఆలోచనే జోలో (ZOLO). ఇది వసతి సేవలు అందిస్తుంది. గదులు, అందులో మంచాలు మాత్రమే కాదు… అవకాశాన్ని బట్టి ఏసీ, పార్కింగ్ లాంటి సౌకర్యాలను కూడా జోలో ద్వారా ఎంచుకోవచ్చు. కొవిడ్ సమయంలో సొంత ఊరికి వెళ్లలేకపోయినవారు, ఎక్కడ గడపాలో తెలియక విలవిల్లాడిపోయారు.
లాక్‌డౌన్‌తో హాస్టళ్లు మూతబడి, కాలేజీలకు సెలవులిచ్చి, ఆఫీసులు పని ఆపేయడంతో.. ఒక్కసారిగా ఎక్కడివారక్కడ ఉండిపోయారు. ఇలాంటి సమయంలో నీడ దొరకని వారిని జోలో ఆదుకుంది. మంచి పేరు తెచ్చుకుంది. అలాగని జోలో ప్రయాణం సజావుగా సాగిందని కాదు. అద్దెల దగ్గర్నుంచీ చెల్లింపుల వరకూ రకరకాల సమస్యలను ఎదుర్కొంది ఈ సంస్థ. వాటన్నిటినీ దాటుకుని ఇప్పుడిప్పుడే విపణిలో నిలదొక్కుకుంటున్నది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ సహా పది నగరాల్లో విస్తరించింది. రూ.800 కోట్లకు పైగా టర్నోవర్‌తో స్థిరంగా ప్రయాణిస్తున్నది. ఇక స్నేహ చౌదరి తనకు ఇష్టమైన వంటలు, ప్రయాణంతో పాటుగా జోలోను కూడా మనసుకు ఇష్టమైన పనిగా… ఆస్వాదిస్తూ అడుగులు వేస్తున్నారు.