AP Jobs | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 163 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏపీలోని 13 సర్వీసుల్లో ఈ పోస్టులను నింపనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
1) డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)- 11
2) అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్- 14
3) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) కేటగిరీ-2 ఇన్ ఏపీ పోలీస్ సర్వీస్- 36
4) DSP (కమ్యూనికేషన్స్) ఇన్ ఏపీ ఏపీ సర్వీస్- 3
5) డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్- 14
6) రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్- 3
7) డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్- 1
8) డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ ఏపీ కో ఆపరేటివ్ సర్వీస్- 15
9) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 ఇన్ ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్- 12
10) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీస్- 2
11) డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్- 3
12) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్- 14
13) డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ పంచాయత్ రాజ్ సర్వీస్- 35
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డీఎస్పీ (కమ్యూనికేషన్స్)కు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

Online
ఎంపిక
అభ్యర్థులను ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్.
ప్రిలిమినరీ పరీక్షలో పేపర్-1 (జనరల్ స్టడీస్- 120 మార్కులు), పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్- 120 మార్కులు) ఉంటాయి. వీటిలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు.
మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ పద్ధతిలో రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లు (తెలుగు, ఇంగ్లిష్), ఐదు జనరల్ కోర్ పేపర్లు (ప్రతి పేపర్‌కు 150 మార్కులు) ఉంటాయి.
ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది.
మొత్తం 825 మార్కులకు ఉంటుంది.
జీతం
ఎంపికైనవారికి డిప్యూటీ కలెక్టర్స్, అసిస్టెంట్ కమిషనర్, డీఎస్పీ, డీఈవో పోస్టులకు రూ. 61,960 నుంచి రూ. 1,51,370, ఆర్టీవో, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760, డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌కు రూ. 65,360 నుంచి రూ. 1,54,980, ఇతర పోస్టులకు రూ. 54,060 నుంచి రూ. 1,40,540 జీతం ఉంటుంది.
చివరితేదీ
ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులు అక్టోబర్ 6న ప్రారంభమవుతాయి. చివరితేదీ అక్టోబర్ 27. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్సైట్ https://psc.ap.gov.inలో చూడండి.