e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News ఎస్‌యూవీల‌కు ఫుల్ క్రేజీ.. ధ‌ర‌లు కూడా ఎక్కువే..

ఎస్‌యూవీల‌కు ఫుల్ క్రేజీ.. ధ‌ర‌లు కూడా ఎక్కువే..

ఎస్‌యూవీల‌కు ఫుల్ క్రేజీ.. ధ‌ర‌లు కూడా ఎక్కువే..

న్యూఢిల్లీ: స్మాల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ)ల‌కు ఫుల్ డిమాండ్ ఉంది.. దానికి అనుగుణంగానే వాటి ధ‌ర‌లు గ‌త మూడేండ్ల‌లో భారీగా పెరిగాయి. స్మాల్ ఎస్‌యూవీలు ప్ర‌త్యేకించి కంపాక్ట్ ఎస్‌యూవీలు కార్ల‌లోనే హాటెస్ట్ సెగ్మెంట్‌గా నిలిచాయి.

వినియోగ‌దారుల నుంచి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగానే 2018 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స్మాల్ ఎస్‌యూవీ కార్ల ధ‌ర‌లు సుమారు 11 శాతం పెరిగాయి. ఆటోమోటివ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ స‌ప్ల‌య‌ర్ జాటో రూపొందించిన డేటా ఈ సంగ‌తి తెలిపింది.

ఇక హ్యాచ్ బ్యాక్ మోడ‌ల్ కార్ల ధ‌ర‌లు నాలుగు శాతానికి పైగా, మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ ధ‌ర‌లు 9 శాతానికి పైగా, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ కార్ల ధ‌ర‌లు 3.5 శాతం, ప్రీమియం సెడాన్ కార్ల ధ‌ర‌లు ఎనిమిది శాతానికి పైగా, లార్జ‌ర్ ఎస్‌యూవీ (నాలుగు మీట‌ర్లకు పైగా పొడ‌వు) కార్ల ధ‌ర‌లు తొమ్మిది శాతానికి పెరిగాయి.

ఎస్‌యూవీ మోడ‌ల్స్ మొద‌లు హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్ మోడ‌ల్ కార్ల ధ‌ర‌లు పెరుగ‌డ‌నికి రెగ్యులేట‌రీ కాస్ట్‌తోపాటు ముడి స‌రుకు ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే కార‌నం అని కార్ల త‌యారీ సంస్థ‌లు చెబుతున్నాయి. సెడాన్ కార్లు క్లాసిక్ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాయి.

ఎస్‌యూవీల‌తో పోలిస్తే సెడాన్ మోడ‌ల్ కార్ల విక్ర‌యాలు ప‌డిపోతే, మ‌ల్టీ ప‌ర్ప‌స్ వెహిక‌ల్స్ (ఎంపీవీ) సేల్స్‌ పెరిగాయి. కంపాక్ట్‌, సెడాన్ మోడ‌ల్ కార్ల‌తో పోలిస్తే ఎస్‌యూవీ సేల్స్ పెరిగాయ‌ని జాటో కంట్రీ హెడ్ ర‌వి భాటియా చెప్పారు.

చిన్న, పెద్ద ఎస్‌యూవీ కార్ల‌కు క‌స్ట‌మ‌ర్ల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతుండ‌టంతో కార్ల త‌యారీ సంస్థ‌లు ఈ సెగ్మెంట్‌లో నూత‌న మోడ‌ల్ కార్లను ఆవిష్క‌రించ‌డానికి పోటీ ప‌డుతున్నాయి.

కంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విక్ర‌యాలు మెరుగ్గా ఉన్నాయ‌ని ఇక్రా ఉపాధ్య‌క్షుడు ఆశీశ్ మొదానీ చెప్పారు. ఈ మోడ‌ల్ కార్ల కోసం వినియోగ‌దారులు వెయిటింగ్‌లో ఉండేందుకు సిద్ధ ప‌డుతుండ‌టం.. కార్ల త‌యారీ సంస్థ‌లు వాటి ధ‌ర‌ల‌ను పెంచ‌డానికి సాహ‌సిస్తున్నాయ‌న్నారు.

ఎస్‌యూవీ సెగ్మెంట్ కార్ల ధ‌ర‌ల‌ను బ‌ట్టి వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఆల్టో మోడ‌ల్ కారు ధ‌ర రూ.5000 పెరిగితే, విటారా బ్రెజాపై రూ.7000 వ‌ర‌కు పెంచుతున్నార‌ని ఆశీశ్ మొదానీ తెలిపారు. కార్ల డీల‌ర్లు కూడా వినియోగ‌దారుల డిమాండ్ ప్ల‌స్ స‌ప్ల‌యిని బ‌ట్టి ధ‌ర‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటారు.

కొన్ని సంద‌ర్బాల్లో బెస్ట్ సెల్లింగ్ మోడ‌ల్ కార్లు, ఇత‌ర మోడ‌ల్ కార్ల కంటే మెరుగ్గా అమ్ముడ‌వుతాయ‌ని జేఎస్ ఫ‌ర్ వీల్ మోటార్ ఎండీ నికుంజ్ సాంఘీ చెప్పారు. కొన్ని సంద‌ర్భాల్లో పాత మోడ‌ల్ కార్ల‌కు డిమాండ్ ఉంటుంద‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

మోటార్ ఫీల్డ్‌కు జంట స‌వాళ్లు: కండ‌క్ట‌ర్ల కొర‌త+చిప్‌ల ధ‌ర‌లు పైపైకి..!!

చిప్‌ల కొర‌త‌.. ఎందుకిలా..

ఇండ్ల‌‌కు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్‌’ ప్రియారిటీ!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

ఇల్లు కొనే వారికి అద్భుత అవ‌కాశం.. సీఎల్ఎస్ఎస్ స‌బ్సిడీలివే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎస్‌యూవీల‌కు ఫుల్ క్రేజీ.. ధ‌ర‌లు కూడా ఎక్కువే..

ట్రెండింగ్‌

Advertisement