ఇడుక్కి: క్రేన్ పనిచేయకపోవడంతో భూమికి 150 అడుగుల ఎత్తులో స్కై-డైనింగ్ రెస్టారెంట్లో నలుగురు పర్యాటకులు, ఒక మహిళ చిక్కుకున్నారు. ఈ ఉదంతం కేరళలోని అనాచల్లో శుక్రవారం జరిగింది. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
బాధితులు రెండు గంటలకు పైగా పైనే చిక్కుకుపోగా, అగ్నిమాపక, ఇతర బృందాలు నలుగురు కుటుంబ సభ్యులను క్షేమంగా కిందకు దించారు. తాడు సహాయంతో పైన ఉన్న రెస్టారెంట్లోకి సహాయ బృందాలు చేరుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.