ముంబై, నవంబర్ 28 : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. బ్యాంకింగ్ మార్గదర్శకాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పట్టించుకోకపోవడంతో ఆర్బీఐ రూ.91 లక్షల జరిమానా విధించింది.
బ్యాంకింగ్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను, అడ్వాన్స్‌లపై వడ్డీరేటు, బ్యాంకుల ద్వారా ఆర్థిక సేవలను అవుట్సోర్సింగ్ చేయడంలో నష్టాలను నిర్వహించడం, ప్రవర్తన నియమావళిపై మార్గదర్శకాలు, కేవైసీపై కొన్ని ఆదేశాలు పాటించనందుకుగాను ఈ జరిమానా విధించినట్టు పేర్కొంది.