యూపీ: నిత్యం వరకట్న వేధింపుల ఉదంతాలు చూస్తున్న తరుణంలో… ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ యువకుడు ఆదర్శంగా నిలిచాడు. ముజఫర్నగర్ జిల్లా నాగ్వా గ్రామానికి చెందిన అవదేశ్రాణాకు, అదే జిల్లాలోని షాహబుద్దీన్నగర్కు చెందిన అదితిసింగ్తో వివాహం నిశ్చయమైంది. నగరంలోని ఫంక్షన్ హాల్లో ఘనంగా వేడుక నిర్వహించారు.
పెళ్లి మండపంలో వధువు తల్లిదండ్రులు… వరుడికి రూ.31 లక్షలు కట్నంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కట్నం తనకు వద్దంటూ చేతులెత్తి నమస్కరించిన అవదేశ్రాణా.. తాను వరకట్నానికి వ్యతిరేకమని తేల్చిచెప్పాడు.