న్యూఢిల్లీ, నవంబర్ 18: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ స్లావియాను పరిచయం చేసింది. ఫోక్స్‌వ్యాగెన్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ విడుదల చేసిన రెండో మోడల్ ఇది కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద రూ.11 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని కంపెనీ సూచించింది. అంతర్జాతీయంగా ప్రతియేటా 15 లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకుతగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. మధ్యస్థాయి సెడాన్ కాైర్లెన హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్‌లకు పోటీగా సంస్థ ఈ మోడల్‌ను విడుదల చేసింది. రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 115 పీఎస్‌ల శక్తినివ్వనున్నది.