హైదరాబాద్, జూలై 26 (నమస్తేతెలంగాణ) : ఈనెల 28న ఢిల్లీలోని మింటో రోడ్ కేఎస్ ఆడిటోరియంలో సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత సదస్సు నిర్వహిస్తున్నామని ఎస్కేఎం ప్రతినిధులు ఆదివారం తెలిపారు. దేశవ్యాప్త ఎస్కేఎం సభ్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, కనీస మద్దతు ధర, తదితర డిమాండ్లపై కార్యాచరణ ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై26 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ‘ఆషాఢ బోనా లు – చేతి వృత్తుల మేళా’కు విశేష ఆదరణ లభించిందని ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ వెల్లడించారు. 11రోజులు నిర్వహించిన మేళా ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా అలోక్‌కుమార్ మాట్లాడుతూ గతేడాది 30స్టాళ్లతో ఐదు రోజులు నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను ఈసారి 60స్టాళ్లతో 11 రోజులపాటు నిర్వహించినట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌తో కమ్మరి, కుమ్మరి, వడ్రం గి, మేదరి తదితర చేతివృత్తుల ఉత్పత్తులకు విసృ్తత ప్రచారం, మా రెటింగ్ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు.