Road Accident | ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బారాబంకి (Barabanki)లోని దేవా-ఫతేపూర్ రహదారిపై ఓ కారును ట్రక్కు బలంగా ఢీ కొట్టింది (car and truck collide). ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు.
బారాబంకి పోలీస్ సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియా తెలిపిన వివరాల ప్రకారం.. దేవా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఉన్నత ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Coimbatore: కోయంబత్తూరులో గ్యాంగ్‌రేప్.. ముగ్గురు నిందితుల అరెస్టు
Rule of Law | మోదీ హయాంలో ఏదీ చట్టబద్ధ పాలన?.. ‘రూల్ ఆఫ్ లా’ ఇండెక్స్‌లో మరింత దిగజారిన భారత్
ఆస్తులు పిసరంత.. అప్పులు కొండంత.. నరేంద్ర మోదీ పాలనలో సామాన్యుడికి తిప్పలు