Prakash Raj | కేరళ రాష్ట్ర జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్గా వ్యవహరించిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ సందర్భంగా ఆయన కొన్ని సూటి వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ .. “జాతీయ చలనచిత్ర అవార్డులు ఇప్పుడు రాజీ పడుతున్నాయని చెప్పడానికి నాకు భయం లేదు. కేరళ జ్యూరీ ఛైర్మన్గా పనిచేయడం నాకు ఆనందంగా ఉంది. కేరళ ప్రభుత్వం నన్ను సంప్రదించినప్పుడు, స్థానికుడిని కాకపోయినా నటనలో అనుభవం ఉన్న వ్యక్తిగా జ్యూరీ బాధ్యతలు స్వీకరించమని కోరారు. నేను అంగీకరించాను. కమిటీ సభ్యులు అవార్డుల ఎంపికలో జోక్యం చేసుకోబోమని, పూర్తిగా స్వేచ్ఛ ఇస్తామని హామీ ఇచ్చారు” అని తెలిపారు.
అయితే “అవార్డుల వ్యవస్థలో కొందరికే ప్రాధాన్యత లభిస్తోంది. జ్యూరీలు రాజీ పడుతున్నప్పుడు మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి ఇలాంటి అవార్డులు అవసరం లేదు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదే సమయంలో మమ్ముట్టి తాజాగా నటించిన భ్రమయుగం చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీంతో ఆయన అత్యధిక సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడిగా కొత్త రికార్డు సృష్టించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు ఈ నేపథ్యంతో రావడంతో సినీ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీశాయి.
మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం వంటి వాటికి కూడా అవార్డులు వస్తున్నాయి. మరి అలాంటి జ్యూరీ, జాతీయ ప్రభత్వ విధానాలు ఉన్నప్పుడు ముమ్ముట్టికి అలాంటి అవార్డులు అవసరం లేదని ప్రకాశ్ రాజ్ అంటున్నారు. వినయంతో, సినిమా సోదరులు పిల్లల మూవీస్ తీయడం గురించి ఆలోచించాలని మేము అభ్యర్ధిస్తున్నాము. దర్శకులు, రచయితలు ఇది కేవలం పెద్దలు, యువకులు మాత్రమే కాదు, పిల్లలు కూడా సమాజంలో భాగమని గ్రహించాలి అంటూ చెప్పుకొచ్చారు.