న్యూఢిల్లీ : ఇల్లు, కార్యాలయం, ప్రయాణాలు… ఇలా ఎక్కడైనా సరే రోజుకు 8.5 గంటలపాటు లేదా వారానికి 60 గంటలపాటు కూర్చుంటే అనారోగ్యంతోపాటు వేగంగా ముసలితనం వస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ప్రతి రోజూ 30 నిమిషాలసేపు పరుగెత్తడం లేదా సైక్లింగ్ వంటి వాటివల్ల కొంత వరకు ప్రయోజనం ఉండవచ్చు. యువత సుదీర్ఘ సమయం కూర్చోవడం వల్ల కొలెస్టరాల్, బాడీ మాస్ ఇండెక్స్‌లపై పడే ప్రభావం గురించి జరిగిన తాజా అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది.
రోజుకు 8.5 గంటలపాటు కూర్చునే యువత, ప్రస్తుతం సిఫారసు చేసినట్లుగా కానీ, అంతకన్నా తక్కువగా కానీ వ్యాయామం చేస్తే, వారికి కార్డియోవాస్క్యులార్, మెటబాలిక్ వ్యాధులు ముప్పు సాధారణం నుంచి అతి ఎక్కువగా ఉండవచ్చునని ఈ పరిశోధకులు తెలిపారు. పని పూర్తయిన తర్వాత వేగంగా నడవడం ఈ ముప్పును తప్పించుకోవడానికి సరిపోదని చెప్పారు. స్టాండింగ్ డెస్క్‌ను వాడటం, మధ్యలో కొంత విరామం ఇస్తూ లేచి, కూర్చుంటుండటం, నడుస్తూ సమావేశాలు నిర్వహించడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు.