న్యూఢిల్లీ, డిసెంబర్ 19 : ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వెండి ధర తగ్గింది. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రూ.3,500 పడిపోయి రూ.2,04, 100కు పరిమితమైంది. స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి అమ్మకాలు పెరుగడమే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తాజా మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నది.
గురువారం ఆల్‌టైమ్ హైకి చేరి రూ.2,07,600 పలికిన విషయం తెలిసిందే. ఇక బంగారం ధర 24 క్యారెట్ 10 గ్రాములు స్వల్పంగా పెరిగి (రూ.15) రూ.1,36,515గా ఉన్నది.