న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. రిఫండ్లు తగ్గుముఖం పట్టడం, కార్పొరేట్లు అత్యధికంగా ముందస్తు పన్ను చెల్లింపులు జరుపడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 17 వరకు రూ.17 లక్షల కోట్ల మేర నికర ప్రత్యక్ష పన్ను వసూలైనట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వీటిలో నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 10.54 శాతం ఎగబాకి రూ.8.17 లక్షల కోట్లకు చేరుకోగా, కార్పొరేటేతర పన్ను వసూళ్లు 6.37 శాతం అధికమై రూ.8.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.