ధర్మపురి, డిసెంబర్ 19 : జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రము ఖ జ్యోతిష్యశాస్త్ర పండితుడు పం డిత పాలెపు రాజేశ్వర్శర్మ(47) మృతి చెందారు. ధర్మపురికి చెందిన ఆయన హైదరాబాద్లో ప్రముఖ జ్యోతిష్య పండితులుగా స్థిరపడ్డారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రా త్రి హైదరాబాద్లోని దవాఖానలో మృతి చెందినట్టు బంధువులు తెలిపా రు. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లో జాతక విశ్లేషణ, శాస్త్రీయ పరిజ్ఞానంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ఎదుట పంచాంగ పఠనం చేశారు. అంత్యక్రియలు హైదరాబాద్లో నిర్వహించగా పలువురు నాయకులు వెళ్లి కన్నీటివీడ్కోలు పలికారు.