సిద్దిపేట అర్బన్, మార్చి 10 : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత ఆర్థిక స్థితిగతులను మార్చేందుకే ప్రతిష్టాత్మకంగా దళితబంధుకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు. దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా స్వావలంబన సాధించి, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో దళితబంధు పథకంలో భాగంగా వ్యవసాయ అనుబంధ యూనిట్లు ఎంపిక చేసుకున్న 145మంది లబ్ధిదారులకు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ హనుమంతరావు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ మేరకు ఒక్కో లబ్ధిదారునితో మాట్లాడారు. వారు ఎంపిక చేసుకున్న యూనిట్ నెలకొల్పేందుకు అయ్యే వ్య యం, నిర్వహణ, అనుభవం, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దళితబం ధు పథకం ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని, దశ ల వారీగా దళితులందరికీ పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేయనుందన్నారు.
లాభదాయక యూనిట్లు ఎంపిక చేసుకోవాలి
మొదటి దశ లబ్ధిదారులు లాభదాయక యూ నిట్లు ఎంపిక చేసుకొని, ప్రతినెలా సుస్థిర ఆదా యం పొంది, ఆర్థికంగా స్వావలంబన సాధించి, మిగతా వారికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో యూనిట్ సక్సెస్ అయ్యేందుకు ప్రతి 5 మంది లబ్ధిదారులకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూరగాయలకు అధిక డిమాండ్ ఉందని, మన అవసరాలకు స్థానికంగా పండించే కూరగాయలు సరిపోక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూరగాయలు, పాలు దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
పాడి గేదెల యూనిట్ల స్థాప న, కూరగాయల సాగుతో నిరంతర సుస్థిర ఆదా యం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసా య అనుబంధ రంగాల యూనిట్లపై దృష్టి పెట్టాలన్నారు. తక్కువ సక్సెస్ రేటు ఉండే ట్రాక్టర్లు, ట్రా లీలు ఇతర యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్ల ను ఎంపిక చేసుకోవాలని కోరారు. ఈ ఉద్దేశంతో నే గ్రౌండింగ్ ముందు వరకు దళితబంధు యూనిట్లో మార్పులకు అవకాశం కల్పించామన్నారు. వచ్చే రెండు రోజుల్లో వ్యవసాయ అనుబంధ రం గాల యూనిట్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దళితబంధు పథకం ముందు, త ర్వాత స్పష్టమైన మార్పులు రావాలన్నారు. డబ్బు లు సంపాదించి.. దళిత కుటుంబాలు బాగుపడాలన్నారు. పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ మాట్లాడుతూ దళితుల్లో నెలకొన్న పేదరికాన్ని దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీ కారం చుట్టారని, లాభదాయక స్కీమ్‌లను ఎంపి క చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే గొప్ప పథకం దళితబంధు అని..
సీఎం కేసీఆర్‌కు దళితుల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.అంతకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, భా రత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా షెడ్యూల్డ్ కు లాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ అధికారి రామాచారి, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, డీఆర్డీవో గోపాల్‌రావు, అదనపు డీఆర్డీవో కౌసల్య, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సత్య ప్రసాద్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, లబ్ధిదారు లు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులతో సహపంక్తి భోజనాలు
దళితబంధు లబ్ధిదారులతో కలెక్టర్ హనుమంతరావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం లబ్ధిదారులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. భోజన సమయంలో లబ్ధిదారు సుగుణమ్మతో మాట్లాడుతూ.. ‘దళితబంధు పథకం మీకు ఉపయోగకరంగా ఉంటుందా? పది లక్షలొస్తే ఏం చేస్తావు? అని ఆప్యాయంగా అడిగారు. మరో లబ్ధిదారు భారతమ్మతో.. ‘నీకేంత మంది కొడుకులు, బిడ్డలు? ఏం యూనిట్ పెడతావ్? అని అడిగారు.