
గజ్వేల్, అక్టోబర్ 29 : గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో పత్తికి రూ.8421 ధర పలికింది. ఈ నెల 20వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా, మొదటి రోజు క్వింటాల్ పత్తికి రూ.7960 ధర పలికింది. శుక్రవారం క్వింటాలుకు రూ.8,421ధర పలికింది. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో 109 క్విం టాళ్ల పత్తి విక్రయాలు ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా జరిగాయి. శుక్రవారానికి 785 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరుగగా, సీజన్ ప్రారంభం నాటి నుంచి బహిరంగ మార్కెట్‌తో కలిసి 22 వేల క్వింటాళ్ల పత్తిని రైతులు విక్రయించారు. 21వేల క్వింటాళ్లకు పైగా పత్తిని ప్రైవేటు పత్తి జిన్నింగ్మిల్లులు కొనుగోలు చేశాయి. పత్తికి ఎన్నడూ లేనివిధంగా ధర పలుకుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.