
వెల్దుర్తి, నవంబర్ 18 : మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని అచ్చంపేట, హక్కీంపేట గ్రామ శివారులోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూకబ్జాపై మూడోరోజు గురువారం సర్వే నిర్వహించారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లక్ష్మీసుజాత ఆధ్వర్యంలోని సర్వేయర్లు సర్వే చేపట్టారు. బుధవారం సర్వే నంబర్లు 77,78,79,80,81,82తోపాటు హక్కీంపేట శివారులోని సర్వే నంబర్ 94లోని 11.27 ఎకరాల్లో గురువారం సర్వే నిర్వహించారు. ఆర్ఐ ధన్సింగ్, వీఆర్వో వెంకటేశం, ఇతర రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లలోని రైతుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. మూడు రోజులపాటు సర్వే నిర్వహించడానికి నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు, గురువారం నాటికి మూడు రోజులు గడిచినా పూర్తిస్థాయిలో సర్వే కాకపోవడంతో మరో రెండు రోజులు సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు. 7,78,79, 80,81,82 సర్వే నంబర్లలో మరో రెండు రోజులపాటు సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేకు సంబంధిత రైతులతోపాటు జమున హ్యాచరీస్ పరిశ్రమ ప్రతినిధులు సహకరించాలని అధికాలు నోటీసులు అందజేశారు.