శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్
సిద్దిపేట అర్బన్, నవంబర్ 17 : సిద్దిపేట చైతన్యవంతమైన జిల్లా అని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి తనవంతుగా కృషి చేస్తానని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్ హనుమంతరావుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సిద్దిపేట జిల్లా తనకు సుపరిచితమైన ప్రాంతమని, గతంలో ఇక్కడ ఆర్డీవో కెరీర్ ప్రారంభించానని, ‘గడా’ అధికారిగా, జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.హనుమంతరావుకు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, ఆర్డీవోలు జయంచంద్రారెడ్డి, విజయేందర్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరీశ్, డీఆర్డీవో గోపాల్‌రావు, జిల్లా సహకార అధికారి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథతో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు.