సిద్దిపేట అర్బన్, నవంబర్ 16 : సిద్దిపేట కొత్త కలెక్టర్గా ఎం.హనుమంతరావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సంగారెడ్డి కలెక్టర్గా పని చేస్తున్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి రాజీనామా చేయగా, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, సిద్దిపేట కలెక్టర్గా ఎం.హనుమంతరావు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనకు జిల్లాకు చెందిన పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.