సిద్దిపేట అర్బన్, నవంబర్ 16: మాజీ కౌన్సిలర్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి యాదాద్రి ఆలయానికి రెండు తులాల బంగారాన్ని సమర్పించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మంత్రి హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజుకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి సిద్దిపేట నియోజకవర్గ పక్షాన కిలో బంగారాన్ని ప్రకటించినందున తన వంతు సహాయంగా 2 తులాల బంగారాన్ని మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఇస్తానని ప్రకటించానని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన తరువాత తొలి కానుకగా తాను ఇవ్వడం సంతోషంగా ఉందని, మంత్రి హరీశ్‌రావు ఏ కార్యక్రమం చేసినా సిద్దిపేట ప్రజల శ్రేయస్సు, లోక కల్యాణార్థం కోసమే అన్నారు. అందులో తాను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.