
వెల్దుర్తి, అక్టోబర్ 31: టీఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దుర్తితో పాటు మండలంలోని మానేపల్లి, మంగళపర్తి, ధర్మారం, దామరంచ, అందుగులపల్లి, జలాల్పూర్, కుకునూర్, చర్లపల్లి గ్రామాల్లో వెల్దుర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు పూర్తిస్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అలా చేయకుండా రాష్ట్రంలో దీక్షలు చేపట్టడం సిగ్గుచేటు అన్నారు. కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ కరణం మురళి, డైరెక్టర్ రమేశ్ చందర్, సొసైటీ సీఈవో సిద్ధయ్య, నాయకులు నరేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, శివరాములు, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, మాణిక్యరెడ్డితో పాటు రైతులు, పాల్గొన్నారు.
మానేపల్లి పెద్దచెరువులో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలాడు
ఇబ్రహీంపూర్లో..
చేగుంట, అక్టోబర్31: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ సొసైటీ పరిధిలోని ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిష్టాపూర్, మక్కరాజిపేట,కర్నాల్‌పల్లి, చెట్లతిమ్మాయిపల్లి తదితర గ్రా మాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానీషా, సర్పంచులు రాములు, గొర్రె రేణుక, శ్రీనివాస్, మోహన్, సంతో ష, ఎంపీటీసీలు భాగ్యమ్మ, బండి కవిత, హోళియానాయక్, మండల రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్లు రాంరెడ్డి, శ్రీనివాస్, నాయకులు నాగభూషణం, బండి విశ్వేశ్వర్, బుచ్చిరెడ్డి, శంకర్‌గౌడ్ ,నర్సారెడ్డి, సీవోలు శ్రీనివాస్ , సంతోష్‌కుమార్, సిబ్బందితో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్, అక్టోబర్ 31: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి అన్నారు. మనోహరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… పీఏసీఎస్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఇమాంపూర్, తూప్రాన్, రావెల్లి, వెంకటరత్నాపూర్, బ్రాహ్మణపల్లి, నాగులపల్లి, నర్సంపల్లి మనోహరాబాద్ మండలంలో దండుపల్లి, కొనాయిపల్లి పీటీ, మనోహరాబాద్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట,అక్టోబర్31: మండలంలోని వెంకటాపూర్ (కె) గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచులు అనూష, అనిల్‌కుమార్, నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు భాగ్యలక్ష్మి, బాల్‌రెడ్డి, రాజిరెడ్డి, ఐకేపీ సీసీ లక్ష్మి, మహిళాసంఘం సభ్యులు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ రవి, టీఆర్ఎస్ నాయకులు దయాకర్, లక్ష్మీనర్సింహులు, నందు, రవి, మహేశ్, రైతులు, హమాలీ కార్మికులు ఉన్నారు.