బెంగళూర్ : కావేరీ జలాలపై బీజేపీ, జనతాదళ్ పార్టీలు రాజకీయం (Cauvery Row) చేస్తున్నాయని కర్నాటక సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని, మేం నిరసనలను అడ్డుకోబోమని, ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్‌లు రాజకీయం చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. కావేరీ జల వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణ జరగనుందని, తమ న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్ధానంలో దీటైన వాదన వినిపిస్తారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కావేరీ నదీ జలాల పంపకంపై తాము అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించినప్పుడు సీఎం పదవికి తాను రాజీనామా చేయాలని ఎవరైనా కోరారా అని ప్రశ్నించారు. అఖిలపక్ష భేటీలో సీఎం పదవి నుంచి వైదొలగాలని తనను ఎవరూ కోరలేదని అన్నారు. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు వ్యతిరేకంగా రైతులు, కన్నడ సంఘాలు ఇచ్చిన బెంగళూర్ బంద్ పిలుపుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ ప్రస్తుత పరిస్ధితిలో నీటి విడుదల కష్టమే అయినా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కోర్టును తాము గౌరవించాల్సి ఉంటుందని, అయితే రాష్ట్ర ప్రయోజనాలు కూడా తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 26న బెంగళూర్ బంద్‌కు పలు రైతు సంఘాలు, కన్నడ సంఘాల నేతలు నగరంలో సమావేశమయ్యారు.
Read More :
Udhayanidhi Stalin | ఉదయనిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు : హిందూ మున్నాని నేత అరెస్ట్