Udhayanidhi Stalin | ఉదయనిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు : హిందూ మున్నాని నేత అరెస్ట్
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై (Udhayanidhi Stalin) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అరణికి చెందిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై : డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై (Udhayanidhi Stalin) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు అరణికి చెందిన హిందూ మున్నాని నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎంకే జిల్లా చీఫ్ ఏసీ మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హిందూ మున్నాని నేత మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 22న జరిగిన వినాయక చవితి వేడుకల సందర్భంగా మహేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అరణి పోలీసులు మహేష్‌ను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కాగా, సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని మాత్రమే తాను కోరినట్టు మహేష్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తాను మాట్లాడుతూ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాల్సి ఉందని పేర్కొన్నానని హిందూ మున్నాని నేత వివరణ ఇచ్చారు.
సెక్షన్ 302 కింద ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు చేపట్టాలని తాను డిమాండ్ చేశానని చెప్పారు. ఉదయనిధి తన వ్యాఖ్యల్లో నిర్మూలించాలనే పదం వాడారాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు, మతపరమైన మనోభావాలను గాయపరిచారని, ఇరు వర్గాల మధ్య శత్రుత్వం ప్రేరేపించారని మహేష్‌పై పోలీసులు అభియోగాలు మోపారు.
Read More :
Mukesh Ambani | ఏకదంతుడి సేవలో అంబానీ కుటుంబం.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

