Gummadi Narasaiah | పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ వేత్తగా, ప్రజా నాయకుడిగా చెరగని ముద్రవేసుకున్నారు (సీపీఐ ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య. నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి.. అనేలా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది ఇల్లందుకు చెందిన గుమ్మడి నర్సయ్య ప్రస్థానం. ఇటీవలే ఆయన బయోపిక్కు శ్రీకారం చుట్టారని తెలిసిందే.
గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్ (Shiva rajkumar) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. డైరెక్టర్ పరమేశ్ హివ్రాలే డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను చూసిన దివంగత నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవిడైరెక్టర్పై ప్రశంసలు కురిపించారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థం అవుతోంది. ఎన్ని అవార్డులు వస్తాయో తెలుస్తుందన్నారు. గుమ్మడి నర్సయ్యగా శివరాజ్‌కుమార్ ప్రాణం పెట్టి నటిస్తున్నట్టు కనిపిస్తోందన్న శ్యామలాదేవి.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
భుజాన ఎర్ర కండువా వేసుకుని ..
మోషన్ పోస్టర్లో తెలుగు రంగు చొక్కా, ధోతిలో భుజాన ఎర్ర కండువా వేసుకుని సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్నాడు. సైకిల్ హ్యాండిల్‌కు సీపీఐఎంఎల్ జెండాను చూడొచ్చు. అసెంబ్లీ ముందు నుంచి మిగిలిన ప్రజాప్రతినిధులంతా బుగ్గ కార్లలో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సాదాసీదాగా సామాన్య వ్యక్తిలా సైకిల్‌తో రావడం గమనించవచ్చు.
ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ.. అందరినీ ఆలోచింపజేసేలా సినిమా ఉండబోతున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్ పరమేశ్ హివ్రాలే. ప్రవళ్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్ సురేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. చిరు గొడవలు, లావణ్య విత్ లవ్ బాయ్స్ సినిమాల్లో నటించిన పరమేశ్ హివ్రాలే ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారుతుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
Presenting the First Look of ‘Karunada Chakravarthy’ Sri @NimmaShivanna’s ambitious project #GummadiNarasaiah ❤️🔥
A powerful glimpse of an extraordinary and inspirational journey. 🔥
A @parameshhivrale directorial
Produced by @Pravallika_Arts Production No.1 #NSureshReddy #NSR… pic.twitter.com/qFf1tuiFTG— BA Raju’s Team (@baraju_SuperHit) October 22, 2025
NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!