Suman Shetty | బిగ్ బాస్ తెలుగు 9లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే సుమన్ శెట్టి. ఎలాంటి నెగిటివిటీ లేకుండా అందరితోనూ కలివిడిగా ఉండే స్వభావం, హాస్యభరితమైన అప్రోచ్, టాస్క్‌లలో చూపించే డెడికేషన్ ఇవన్నీ కలిసి ఆయనను ప్రేక్షకుల ఫేవరెట్‌గా నిలబెట్టాయి. హౌస్‌లో సంచాలకుడిగా, కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించినా లేదా టాస్క్‌లలో పాల్గొన్నా, సుమన్ ఎల్లప్పుడూ న్యాయంగా వ్యవహరించడమే కాదు, తప్పుంటే తప్పు అని చెప్పే ధైర్యం చూపిస్తాడు. ఈ ప్రవర్తనే ఆయనకు “పాజిటివ్ కంటెస్టెంట్” అనే పేరు తెచ్చింది. అయితే తాజాగా విడుదలైన బిగ్ బాస్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సుమన్ శెట్టి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశం అభిమానులను కదిలించింది.
బిగ్ బాస్ హౌస్‌లో కొత్త నామినేషన్ టాస్క్ ప్రారంభమైంది. గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ కొన్ని బొమ్మలు ఉంచి, వాటిపై హౌస్మేట్స్ ఫోటోలు పెట్టాడు. కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ తమకు నచ్చిన బొమ్మను తీసుకొని సేఫ్ జోన్‌కి వెళ్లాలి. అయితే చివరగా ఎవరి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో, ఆ కంటెస్టెంట్ నామినేషన్లోకి వెళ్తారని రూల్ చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో సంజన రీతూ గురించి మాట్లాడుతూ, “నేను ఒంటరిగా గేమ్ ఆడుతున్నా, కానీ రీతూ గేమ్‌లో పవన్ ఇన్ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంది” అని వ్యాఖ్యానించింది. దాంతో రీతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత సంజన-తనూజా, తనూజా-దివ్యల మధ్య కూడా వాదనలు జరిగాయి.
చివరగా సుమన్ శెట్టి వద్ద తనూజా బొమ్మ మిగిలింది. అయితే ఆయన చేసిన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఇది నా ఫాల్ట్… నేను నెమ్మదిగా వెళ్ళాను. తనూజా నామినేట్ అవ్వకూడదు. అందుకే నాకు నేను నామినేట్ అవుతున్నాను,” అని చెప్పి తనను తానే నామినేట్ చేసుకున్నాడు సుమన్. ఆ సన్నివేశం తర్వాత సుమన్ కంటతడి పెట్టుకోవడంతో, హౌస్‌లోని సభ్యులు మరియు ప్రేక్షకులందరూ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో సుమన్ శెట్టి అభిమానులు సుమన్ లాంటి కంటెస్టెంట్లు చాలా అరుదు, హృదయాన్ని తాకే సీన్ ఇది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో సుమన్ శెట్టిపై అందరు సానుభూతి చూపుతున్నారు. ఆయన ఈ నిర్ణయం గేమ్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి . కాకపోతే ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఆయన గెలిచేశారు!