Manjummel Boys | మాలీవుడ్ నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys). చిదంబరం దర్శకత్వంలో సర్వైవర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 22న విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో కూడా మంచి స్పందన రాబట్టుకుంది. మంజుమ్మెల్ బాయ్స్ మలయాళం, తెలుగు, తమిళం హిందీ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు.
చాలా రోజుల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళ ప్రభుత్వం ప్రకటించిన 55వ కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్‌లో క్వీన్ స్వీప్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కేరళ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సాజి చెరియన్ త్రిస్సూర్‌లో జరిగిన ఈవెంట్లో ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 10 కేటగిరీల్లో మంజుమ్మెల్ బాయ్స్ అవార్డులను గెలుచుకుంది. భ్రమయుగం సినిమాకుగాను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికయ్యాడు.
అవార్డులు విభాగాల వారిగా..
ఉత్తమ చిత్రం -మంజుమ్మెల్ బాయ్స్
ఉత్తమ దర్శకుడు -చిదంబరం
ఉత్తమ స్క్రీన్ ప్లే -చిదంబరం
ఉత్తమ సహాయ నటుడు సౌబిన్ షాహిర్
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అజయన్ చలిస్సెరి
ఉత్తమ సినిమాటోగ్రఫీ- శైజు ఖలీద్
ఉత్తమ సౌండ్ డిజైన్- షిజిన్, అభిషేక్,
ఉత్తమ సౌండ్ మిక్సింగ్- ఫజల్ అండ్ షిజిన్, ఉత్తమ లిరిసిస్ట్- వేదాన్
ఉత్తమ కలరిస్ట్- స్రిక్ వారియర్
#ManjummelBoys at #KeralaStateAward
Best Art Director – Ajayan Chalassery.
Best Cinematography – Shaiju Khalid
Best Sound Design – Shijin Huttton, Abhishek Nair
Best Sound Mixing – Fazal A Backer, Shijin Hutton
Best Colorist – Srik Varier
Best Film
Best Screenplay – Chidambaram… pic.twitter.com/Z6KabRHqLo— AB George (@AbGeorge_) November 3, 2025
NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!