The Girl Friend | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టైటిల్ రోల్లో నటిస్తోన్న సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. నవంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో రష్మిక అండ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నాన్ థ్రియాట్రికల్ రైట్స్ విషయంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ది గర్ల్‌ఫ్రెండ్ నాన్ థ్రియాట్రికల్ రైట్స్‌కు ఏకంగా రూ.21 కోట్లు పలికాయి. వీటిలో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.4 కోట్లు, ఆడియో రూ.౩ కోట్లు పలికాయి.
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#TheGirlfriend has fetched impressive non-theatrical deals💥
👉Netflix – ₹14 Cr
👉Satellite – ₹4 Cr
👉Audio – ₹3 Cr#RashmikaMandanna’s star power & the banner’s reputation have worked wonders. pic.twitter.com/GIIVHsW3pM
— Filmyscoops (@Filmyscoopss) November 3, 2025
NC 24 | చేవెళ్ల ప్రమాదం.. చైతూ మూవీ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తూ ప్రకటన
Dragon | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ “డ్రాగన్” సినిమా రెండు భాగాలుగా.. భారీ స్కేల్లో షూటింగ్..!
Kantara Chapter 1 | కొనసాగుతున్న కాంతార చాప్టర్ 1 హవా.. కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు!