హనుమకొండ చౌరస్తా, జూలై 3 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అడ్‌హక్ కమిటీ సభ్యులు అడ్వకేట్ నొడపెల్లి శ్యామ్‌కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని, నెలకు రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఉద్యమకారులకు సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో ఉద్యమ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి 2014 వరకు జరిగిన వివిధ దశల ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించేందుకు తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 5న ఉదయం 10.30 గంటలకు హనుమకొండ కాకతీయకా లనీలోని తెలంగాణ ఉద్యమకారు ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఛైర్మన్ ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు బోరిశెట్టి అశోక్, ఏ.రమేశ్, ఎరం మనోహర్‌రావు, చెన్నూరి నటరాజ్, మోగుసాల దేవేందర్, మెర్జా అమ్జద్బేగ్, రాంపెల్లి శ్రీనివాసచారి, జక్కుల స్వామి, బైరి రమేశ్, దారా సూరి, వంగపండ్ల రవియాదవ్, అరికె రాంకుమార్, లింగపెల్లి సంపత్‌రావు, సౌరం స్వర్ణలత, కుంటి పద్మ, బొల్లు లక్ష్మీ, కుంటి నవ్య పాల్గొన్నారు.