అచ్చంపేట రూరల్, జూలై 28 : అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనోవేదనతో మాజీ సర్పంచ్ మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అచ్చంపేట మండలం ఐనోల్ మాజీ సర్పం వడ్త్య సోని (86) తన హయాంలో గ్రామ పంచాయతీ పరిధిలో రూ.38 లక్షల అభివృద్ధి పనులు చేశారు. ఇందుకుగానూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.23 లక్షల బిల్లులు మంజూరయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రూ.15 లక్షల బిల్లులు పెం డింగ్లోనే ఉన్నాయి. బిల్లులు ఎప్పుడు వసాయో? అని ఎదురుచూసి నిత్యం కృంగిపోయిన ఆమె మంగళవారం గుండెపోటుతో మృతిచెందింది. బీఆర్ఎస్ నాయకులు పోకల మనోహర్తోపాటు పలువురువెళ్లి నివాళులర్పించి కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు.