శాస్త్రోక్తంగా సర్వ పృష్టేష్టి యాగం..

తిరుమల, జూలై : లోక కల్యాణార్థం తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న శ్రౌత యాగాల్లో భాగంగా 6వ రోజైన గురువారం సర్వ పృష్టేష్టి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహేన్ద్రయాగ పూర్వక మృగారషట్కము అనే శ్రౌత యాగాలు జూలై 10వ తేదీ నుంచి జరుగుతున్నాయి. ఈ యాగాలు రేపటితో ముగియనున్నాయి.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వేద విజ్ఞానపీఠంలో 9 మంది ప్రముఖ రుత్వికులు త్రేతాగ్నులు అనే హోమగుండాలలో అగ్నిని మదించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు (ఇష్టి) నిర్వహిస్తున్నారు. ఈ యాగాలు నిర్వహించడం వల్ల అగ్ని నుంచి విష్ణువు వరకు సమస్త దేవతల అనుగ్రహం పొందుతారని, లోకంలోని సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉంటాయని, ఆరు ఋతువులలో సుభిక్షంగా ఉంటారని, సర్వ పాపాలు తొలగిపోతాయని వేద పండితులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- TTD
- TTD Board
- TTD temple
- yagam
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

