Shreyas Iyer : భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer గాయం గురించి ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఈ స్టార్ బ్యాటర్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC Final 2023)కు సిద్ధమవుతున్నాడు. అందుకనే అతను సర్జరీ తీసుకోనేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరం కావాల్సి వస్తుంది. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం కోసం అయ్యర్ సర్జరీకి ససేమిరా అంటున్నాడు.
ట్రీట్మెంట్ కోసం అతను ఈరోజు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కు వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఇంజక్షన్ తీసుకోనున్నాడని సమాచారం. ఎన్సీఏలోని స్పెషలిస్ట్‌లు, అధికారులను అయ్యర్ కలిశాడు. అతడితో పాటు అందరూ సర్జరీకి మొగ్గు చూపడం లేదు. అయితే.. అంతిమంగా అయ్యర్ వైద్య నిపుణుల సలహాలను పాటిస్తాడు అని అతడి సన్నిహితులు చెప్తున్నారు. బోర్డర్ – గవాస్కర్(Border – Gavaskar Trophy) ట్రోఫీ ఆఖరి టెస్టుకు ముందు వెన్ను నొప్పి తిరగబెట్టడంతో అయ్యర్ బ్యాటింగ్‌కు రాలేదు. అంతేకాదు వన్డే సిరీస్‌కు మిస్ అయిన అతను ఐపీఎల్ 16వ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. అయ్యర్ గైర్హాజరీలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఫ్రాంఛైజీ నితీశ్ రానా(Nitish Rana)కు పగ్గాలు అప్పగించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రెండో ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని ఓవల్ ఆతిథ్యం ఇస్తోంది. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా తలపడనున్నాయి. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతితో భంగపడిన భారతజట్టు ఈసారి ఎలాగైనా టెస్టు గదను గెలవాలనే కసితో ఉంది. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో ఇరగదీస్తున్నారు. దాంతో, ఈ సారి టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. స్వదేశంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన ఆత్మవిశ్వాసంతో ఉంది.