
హైదరాబాద్, జనవరి 26: బీజేపీ అనుసరిస్తున్న విధానాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ కే కేశవరావు అన్నారు. కుల, మతాల పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తుండటం చాలా బాధాకరని ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిషరించి మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తున్నదని, రాష్ట్ర ప్రజల కలలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో మాత్రమే సాకారమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బండి రమేశ్, లింగంపల్లి కిషన్‌రావు, కట్టెల శ్రీనివాస్‌యాదవ్, ట్రైకార్ మాజీ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు.