నిర్మల్ టౌన్, జనవరి 6 : ఒమిక్రాన్ వైరస్‌తో పాటు కొవిడ్ వైరస్ మూడో దశ కేసులు పెరుగు తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమ త్తంగా ఉండి ప్రజలను రక్షించేందుకు అన్ని చర్య లు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురు వా రం క్యాంపు కార్యాలయంలో మూడో దశ వైర స్ వ్యాప్తిపై జిల్లా అధికారులతో అత్యవసర సమా వేశం నిర్వహించారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని సూ చించారు. ప్రభుత్వ దవాఖానలో లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి హోంఐసోలేషన్ చికి త్స అందించాలన్నారు. జిల్లా వైద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని దవాఖానల్లో రోగులకు చికిత్స అందిం చేలా బెడ్లు, మందులు అందించాలని సూచించా రు. అర్హులైన వారికి కొవిడ్ టీకాను వేయాలన్నా రు. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ. వెయ్యి జరిమానా విధించాలన్నారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్రాజు, డీపీవో వెంకటేశ్వర్రావు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, మెప్మా పీడీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి
ఖానాపూర్ పట్టణాన్ని అధికారులు సుందరంగా తీర్చిదాద్దాల ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొ న్నారు. గురువారం అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పట్టణంలో పలు అభివృద్ధి పను లను పరిశీలించారు. కుమ్రం భీం చౌరస్తాలో రూ. 25 లక్షలతో చేపట్టిన డంప్ యార్డు నిర్మాణం పనులపై కాంట్రాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసే షెడ్లలను వెంటనే నిర్మించా లని మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్‌ను ఆదేశించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్ వద్ద శశ్మాన వాటిక పనులను పరిశీలించారు. మున్సిపాలిటీలో ఉద్యానవన పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 90లక్షలు మంజూరు చేసిం దని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, తహసీల్దార్ లక్ష్మి, మున్సిపల్ ఏఈ తిరుపతి, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.