ACP Satyanandam | ఏసీపీ సత్యానందం ఇంట్లో ఏసీ, గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు..!
ACP Satyanandam | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని పటమటలంక ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ ప్రమాదం సంభవించింది. పోలీస్ ఉన్నతాధికారి, ఏసీపీ సత్యానందం నివాసంలో మొదట ఏసీ కంప్రెషర్, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికంగా కలకలం రేగింది.
ACP Satyanandam : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలోని పటమటలంక ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ ప్రమాదం సంభవించింది. పోలీస్ ఉన్నతాధికారి, ఏసీపీ సత్యానందం నివాసంలో మొదట ఏసీ కంప్రెషర్, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. అయితే పేలుడు ధాటికి ఎగిరివచ్చిన రాయి తగిలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏసీపీ సత్యానందం తన కుటుంబంతో కలిసి ఈ నెల 7న విదేశీ పర్యటనకు వెళ్లారు. దాంతో వారి ఫ్లాట్ లాక్చేసి ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఏసీ కంప్రెషర్ నుంచి భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రతకు సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. ఈ పేలుళ్ల ధాటికి అపార్ట్మెంట్లోని కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి శిథిలాల నుంచి ఓ రాయి బయట రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి బలంగా తాకింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పెద్ద శబ్దాలు విని భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏసీ కంప్రెషర్లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

