న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వచ్చిన సీ-130 జే మిలిటరీ విమానం తిరిగి వెళ్లిపోయింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె ప్రత్యేక సీ-130 ట్రాన్స్పోర్ట్ విమానంలో ఇండియాకు వచ్చారు. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమె దిగారు. అయితే ఇవాళ ఉదయం 9 గంటలకు ఆ విమానం మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయింది. ఆ విమానంలో హసీనా లేనట్లు అధికారులు చెప్పారు. ఏడు మంది మిలిటరీ సిబ్బందితో .. హిండన్ ఎయిర్‌బేస్ నుంచి బంగ్లా ఎయిర్ ఫోర్స్ విమానం బయలుదేరినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంపై ఇవాళ కేంద్ర మంత్రి జైశంకర్ మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభలో ప్రకటన చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి చేరుకున్న హసీనాను.. ఓ సురక్షితమైన ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.