శర్వానంద్ (Sharwanand) హీరోగా శ్రీకార్తీక్ (Shree Karthick) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). తల్లీకొడుకుల రిలేషన్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అక్కినేని అమల శర్వానంద్ తల్లిపాత్రలో నటించారు. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించింది. న్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.
యూఎస్ఏ లో ఆదివారం ముగిసేనాటికి రూ.2,38,67,190 (3 లక్షల డాలర్లు) వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. మౌత్ టాక్ బాగుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశమున్నట్టు అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు.
తల్లీకొడుకుల మధ్య అనుబంధం, స్నేహితుల మధ్య సాగే ఎమోషన్స్ కు టైమ్ ట్రావెల్‌ను జోడిస్తూ సినిమా తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సినిమా అద్బుతంగా ఉందని, మీరు అమ్మలను సినిమాకు తీసుకెళ్లండి అంటూ హీరోయిన్ అదితీరావు హైదరి ట్వీట్ కూడా చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది.