Krishnam Raju Last Rites | సినీ నటుడు, నిర్మాత రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు. హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టాడు. కడసారీ వీడ్కోలు పలికేందుకు రెబల్‌స్టార్ అభిమానులు కనకమామిడి ఫాంహౌజ్‌కు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో సినీప్రముఖులు, రాజకీయనాయకులు అంతిమ సంస్కారాలకు హాజరైయ్యారు.
కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత కోంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు. అంతిమ యాత్రకు ముందు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
Read Also:
“కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన వైద్యులు”
“మా ఊరి హీరో.. కృష్ణంరాజు: మెగాస్టార్ చిరంజీవి”
“krishnam raju | కృష్ణంరాజుకు ప్రముఖుల నివాళి ఫొటోలు, వీడియో”
“Pawan kalyan | కృష్ణంరాజు ఉండే వీధిలోనే ఉండేవాళ్లం : పవన్ కల్యాణ్”