కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన వైద్యులు
Krishnam raju | ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఏఐజీ దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో
హైదరాబాద్: ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఏఐజీ దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. ‘కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ బాధపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన దవాఖానలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల హాస్పిటల్లో చేరిన నాటినుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశాం. ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారు’ అని వైద్యులు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

