ఇండియాలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో టాప్ ప్లేస్ లో ఉంటాడు స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar). సినీ ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు శంకర్. ఈ దర్శకుడు సినిమా చేస్తున్నాడంటే చాలు అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. తనదైన స్టైలిష్ మార్క్ సినిమాలు చేసే శంకర్ ప్రస్తుతం విలక్షణ హీరో కమల్ హాసన్‌తో ఇండియన్ 2, టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్‌తో ఆర్సీ 15 సినిమాలుచేస్తున్నాడు. కాగా శంకర్ మరో సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తమిళ నవల వేల్పరి ఆధారంగా సినిమా చేయబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈసినిమాలో స్టార్ హీరో సూర్య (Suriya ) లీడ్ రోల్ చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్ నడుస్తుండగా..ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రీసెంట్గా విరుమన్ ఆడియో లాంఛ్‌లో సూర్య ఈ సినిమాకు సంబంధించిన హింట్ ఇవ్వడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది.
సూ వెంకటేశ్ కథనందించబోతున్న ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాడట శంకర్. మొత్తానికి ఈ క్రేజీ అప్డేట్ తో సినీ ఇండస్ట్రీలో మరో బిగ్గెస్ట్ రాబోతుందని స్పష్టమవుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందేనంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత