Kolanu Pradeep Reddy | హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
శంషాబాద్ ప్రాంతంలో ప్రదీప్ రెడ్డికి ఉన్న మంచి పేరు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కొలను ప్రదీప్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, అభిమానులు కూడా బీఆర్ఎస్లో చేరారు.
శంషాబాద్లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి.
శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/XMyxgE0ITS
— BRS Party (@BRSparty) September 24, 2025