Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ OG (ఓజి) మరోసారి టాలీవుడ్ మార్కెట్‌ను షేక్ చేసింది. గత కొన్నేళ్లుగా ఏ సినిమా చూసినా ఇంత స్థాయి హైప్, బజ్ కనిపించలేదు. ట్రైలర్, టీజర్, సాంగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేసిన OG సినిమా… రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. OG సినిమాకు వర్క్అవుట్ అయిన ఓ మేజర్ అసెట్ అంటే అది థమన్ మ్యూజిక్, పవన్ ఇమేజ్. ఈ రెండు కలిసే సినిమాను దాదాపు రూ.175 కోట్ల థియేట్రికల్ బిజినెస్ స్థాయికి తీసుకెళ్లాయి. అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో రేట్లకు రైట్స్ అమ్ముడుపోయిన OG… పవన్ కెరీర్లో హయ్యెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాగా నిలిచింది.
నాన్-థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ.120 కోట్లు జరిగినట్టు తెలుస్తుంది. ఇక OTT, డబ్బింగ్, ఆడియో రైట్స్ రేట్లు వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే . OTT రైట్స్ రూ. 80 కోట్లుకి ఓ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కొన్నట్లు సమాచారం. హిట్ అయితే అదనపు డీల్ ఉందట. ఆడియో రైట్స్, రూ. 16 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్లు, శాటిలైట్ హక్కులు ఇంకా అమ్మలేదు కానీ రిలీజ్ తర్వాత రూ. 10 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తం నాన్-థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.120 కోట్లు జరిగిందని అంటున్నారు. ఇక OG మొత్త బిజినెస్ రూ.295 కోట్లు అని టాక్. థియేట్రికల్ (₹175Cr) + నాన్ థియేట్రికల్ (₹120Cr) మొత్తంగా ₹295 కోట్ల బిజినెస్.
OG బడ్జెట్ సుమారుగా రూ.200 కోట్లు అని పరిశ్రమలో టాక్. ఈ లెక్కన చూసుకుంటే OG సినిమాకు రిలీజ్‌కి ముందే దాదాపు రూ.95 కోట్ల లాభాలు వచ్చాయన్నమాట. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది ఓ పవర్ ఫుల్ రికార్డ్. ఇక OG పై ఉన్న మాస్ మేనియా చూస్తే.. సినిమా విడుదలైన రోజు పండగ వాతావరణం కనిపించేలా ఉంది.. ఒక్క హైదరాబాద్‌లోనే 550 షోలు హౌస్‌ఫుల్ కావడం, దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్ని కూడా OG స్పెషల్ షోస్‌తో నిండిపోవడం చూస్తే ఈ మూవీ అనేక రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.. రిపోర్ట్స్ ప్రకారం OG అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజే రూ.60 కోట్లు గ్రాస్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.