అవార్డులు బరువైతున్నయ్: షై హోప్
భారత పర్యటనలో సత్తాచాటుతున్న వెస్టిండీస్ సారథి షై హోప్ సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అవార్డుల పంట పండిస్తున్నాడు.
హైదరాబాద్: భారత పర్యటనలో సత్తాచాటుతున్న వెస్టిండీస్ సారథి షై హోప్ సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అవార్డుల పంట పండిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 4 శతకాలు (వన్డేల్లో 2, టీ20ల్లో 2) చేసిన ఈ విండీస్ కెప్టెన్ మూడుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులూ సొంతం చేసుకున్నాడు.
అదీగాక మ్యాచ్‌లు ముగిశాక వివిధ విభాగాల్లో ఇచ్చేవీ (లాంగెస్ట్ సిక్స్, హయ్యస్ట్ ఫోర్స్ వంటివి) కొన్ని ఉంటాయి. అయితే ఈ అవార్డులన్నీ బరువవుతున్నాయంటున్నాడు విండీస్ సారథి. బుధవారం హైదరాబాద్‌లోనూ సెంచరీ కొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అతడు టీమిండియా టైటిల్ స్పాన్సర్ ముత్తూట్ ఫిన్‌కార్ప్ గోల్డెన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఖాతాలో వేసుకున్నాడు.
మ్యాచ్ ముగిశాక మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే ఈ అవార్డులు కొంచెం బరువు అవుతున్నాయి. మేము ఇంటికి వెళ్లేప్పుడు లగేజీ బరువును కూడా చూసుకోవాలి. ఈ అవార్డులతో మాకు కొన్ని సమస్యలు వచ్చేట్టే ఉన్నాయి (నవ్వుతూ). అయితే నేను జట్టు కోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని హోప్ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

