కాంగ్రెస్ అసమర్థతతోనే సాగునీటి సంక్షోభం
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రంలో సాగునీటి సంక్షో భం ఏర్పడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఏపీలో లేని కరెంట్ కష్టాలు తెలంగాణలోనే ఎందుకు?: వేముల
వేల్పూర్, అక్టోబర్ 15: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రంలో సాగునీటి సంక్షో భం ఏర్పడిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందించి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలనలో కనీసం 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాలు లేకపోవడమే విద్యుత్తు కొరతకు కారణమంటూ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో లేని కరెంట్ కో తలు తెలంగాణలోనే ఎందుకు నెలకొన్నాయని నిలదీశారు.
రాష్ట్రంలో కరెంట్ కొరత రాకూడదనే కేసీఆర్ ముందుచూపుతో కొత్తగూడెం (800 మెగావాట్లు), భద్రాద్రి (540 మెగావాట్లు), యాదాద్రి (4,000 మెగావాట్లు) వంటి భారీ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించారని గుర్తుచేశారు. ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయకుండా ఉత్పత్తిని 13 వేల మెగావాట్లు తగ్గించిందని ఆరోపించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు నిరూపించినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

