రేవంత్.. ప్రజలే నీ ఉద్యోగం ఊడగొడ్తరు
అధికారుల ఉద్యోగాలు ఊడగొడ్తానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి మున్ముందు ప్రజలు, ఉద్యోగులే బుద్ధి చెప్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు.
- ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : అధికారుల ఉద్యోగాలు ఊడగొడ్తానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి మున్ముందు ప్రజలు, ఉద్యోగులే బుద్ధి చెప్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. అధికారుల కంటే ముందే ప్రజలే ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని ఊడగొట్టే రోజులు దగ్గరపడ్డాయని, జాగ్రత్తగా చూసుకోవాలని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.
విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ సర్కార్ చేతగానితనమే కారణమని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు అధికారులపై నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని గురువారం ‘ఎక్స్’లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ముందుచూపుతో కనీస బొగ్గు నిల్వలు కూడా సమకూర్చుకోకుండా విద్యుత్ సంక్షోభానికి కారణమైందే కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. శాఖాపరమైన సమీక్షలు నిర్వహించకుండా విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేయడం వల్లే ఇవాళ రాష్ట్రమంతటా కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. సొంత తప్పులను ఇతరులపైకి నెట్టేసి పాలకులు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గతంలోనూ ఇదే తంతు
గతంలో నిషేధిత భూముల జాబితా విషయంలో తప్పులు చేసి అధికారులపైకి నెట్టిన రేవంత్ సరార్.. ఇప్పుడు కరెంట్ కోతల విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తున్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి విషమించాక నిద్రలేచి, అధికారులను సస్పెండ్ చేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతున్నదని మండిపడ్డారు. తమ పాలనా వైఫల్యాలను అధికారుల ఖాతాలో వేసి చేతులు దులుపుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. ఎల్ నినోను కొవిడ్ లాంటి ప్రకృతి విపత్తుతో పోల్చుతున్న పాలకులు.. వాటన్నింటికంటే రేవంత్‌రెడ్డి పాలనే రాష్ర్టానికి అతిపెద్ద విపత్తుగా మారిందనే నిజాన్ని ఎందుకు గుర్తించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

