నారాయణపేట : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ ( Scholarship ) , ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ( Reimbursements ) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ( SFI ) శనివారం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్షను నిర్వహించింది . ఎస్ఎఫ్ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బలరాం( President Balram ) , రాష్ట్ర నాయకులు నరహరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8,150 వేల కోట్లు స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ కింద తక్షణమే విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తవుతున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తుందని విమర్శించారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటుందని పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ , ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకుని టీసీ,బోనఫైడ్ కోసం కళాశాలలకు వెళితే పెండింగ్ ఫీజు గురించి అడుగుతున్నారని తెలిపారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా నాయకులు నవీన్, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చెందర్ , ఉపాధ్యక్షులు ధర్మరాజు , దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కాశప్ప, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, జిల్లా అధ్యక్షులు బాలప్ప తదితరులు పాల్గొన్నారు.