Reliance | గతవారం ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లు `బేర్`గుప్పిట్లో చిక్కుకోవడంతో టాప్-10 స్క్రిప్ట్ల్లో ఏడు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.16 లక్షల కోట్లు కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. గతవారం ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 672 (1.15 శాతం) పాయింట్లు పతనమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఇన్ఫోసిస్ లాభ పడ్డాయి.
రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 41,706.05 కోట్ల నష్టంతో రూ.16,08,601.05 కోట్లకు చేరుకున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.17,313.74 కోట్ల పతనంతో రూ.4,73,941.51 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,806.39 కోట్లు కోల్పోయి రూ. 6,01,156.60 కోట్లతో సరిపెట్టుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.13,423.6 కోట్ల నష్టంతో రూ.7,92,270.97 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,830.97 కోట్ల పతనంతో రూ.4,16,077.03 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.10,240.83 కోట్లు తగ్గి రూ.4,44,236.73 కోట్లకు పరిమితమైంది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ. 8,731.55 కోట్ల నష్టంతో రూ.4,44,919.45 కోట్లతో సరిపెట్టుకున్నది.
మరోవైపు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,144.57 కోట్లు వృద్ధి చెంది రూ.5,94,608.11 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.7,976.74 కోట్లు పెరిగి రూ.10,99,398.58 కోట్ల వద్ద నిలిచింది. హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.4,123.53 కోట్ల లబ్ధితో రూ.6,33,649.52 కోట్లకు చేరుకున్నది. శుక్రవారం ట్రేడింగ్ ముగిశాక రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్పోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ నిలిచాయి.