హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని సింబయాసిస్ వర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకేరోజు 40 కుకలను చంపిన ఘటనపై దాఖలైన ప్రజాహిత వాజ్యం విచారణకు హైకోర్టు నిరాకరించింది. వీధికుకల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారిస్తున్నందున ఈ పిల్‌ను అకడే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.
ఈ పిల్‌ను అకడికి బదిలీ చేయాలని చీఫ్‌జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం రిజిస్ట్రీని ఆదేశించింది. నలభై కుకలను సామూహికంగా చంపిన పంచాయతీ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది వీ రిషిహాస్రెడ్డి పిల్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు, పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కాకుండా కుకలను చంపినట్టుగా ఆధారాలు ఏమి ఉన్నాయని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2019లో ఏర్పాటైన బోర్డు పదవీ కాలం ముగిసినట్టయితే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. రాష్ట్రంలో పెంపుడు జంతువులను అమ్మే దుకాణాలు, కుకల పెంపకం కేంద్రాలను చట్టప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యం పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. మూడేండ్ల కాలపరిమితితో 2019లో ఏర్పాటైన జంతు సంక్షేమ బోర్డు గడువు ఇప్పటికే ముగిసిందని, కొత్త సభ్యుల నియామకం కోసం నిరుడు జనవరిలో దరఖాస్తులు ఆహ్వానించినా ఇప్పటికీ బోర్డు ఏర్పాటు కాలేదని తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ ప్రతివాదన చేస్తూ.. సమగ్ర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. జంతు హింసను నిరోధించేందుకు అన్ని జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.