దుబాయ్: గతవారం ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన నిలిచిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్థానాన్ని న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ అధిగమించాడు.
భారత్తో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండు శతకాలతో 352 రన్స్ చేసిన మిచెల్.. 845 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. కోహ్లీ (795) రెండో స్థానంలో ఉండగా రోహిత్ శర్మ (757), శుభ్మన్ గిల్ (723) వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు.