గువాహటి: దేశవాళీలో ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ అయిన సంతోష్ ట్రోఫీని సర్వీసెస్ సొంతం చేసుకుంది. ఆదివారం అసోంలోని దాకువాఖనలో జరిగిన ఫైనల్లో సర్వీసెస్.. 1-0తో కేరళను ఓడించి 79వ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
ఇరుజట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సర్వీసెస్ తరఫున స్ట్రైకర్ అభిషేక్ పవార్ 109వ నిమిషంలో గోల్ కొట్టి ఈ టోర్నీలో ఆ జట్టును 8వ సారి విజేతగా నిలిపాడు.