సెమీస్‌కు ఉత్తరాఖండ్
రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఉత్తరాఖండ్ సెమీస్‌కు చేరుకుంది. జంషెడ్పూర్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ తొలి క్వార్టర్స్‌లో ఆ జట్టు.. ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది.
జంషెడ్పూర్: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఉత్తరాఖండ్ సెమీస్‌కు చేరుకుంది. జంషెడ్పూర్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ తొలి క్వార్టర్స్‌లో ఆ జట్టు.. ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో ఉత్తరాఖండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదట జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 రన్స్‌కే ఆలౌట్ అవగా ఉత్తరాఖండ్ 371 పరుగులు చేసి 136 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దక్కించుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్‌ను 130 పరుగులకే కుప్పకూల్చింది. వెటరన్ స్పిన్నర్ మయాంక్ మిశ్రా (5/22), అభయ్ నేగి (4/36) బంతితో విజృంభించి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించారు. రెండో క్వార్టర్స్‌లో జమ్మూకాశ్మీర్ సైతం సెమీస్‌కు చేరువైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు నిర్దేశించిన 291 పరుగుల ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్.. 87/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

